నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

రామ రామ నా రామా అన్నావు
అనగా అనగా నీతో కులికి తిరిగినాడు
తిరిగి తిరిగి నిన్ను అడవులకు తోలినాడు
తొలిననూ నోరు మెదపక పిదప ప్రాణమిచ్చినావు

చాకలి వాకిలి బయట పలకడమేమి
లోకులు కాకులని తెలియని రాముడు రాజేల తల్లీ ?
ఇలాటి రాముడికన్నా నయం నీ రాముడని
నా దేవికి చెప్పమ్మా సీతమ్మా

జోలె సంచి బట్టి బుడిదిచ్చు వాని కధేమి
ముఖస్తుతికి పడిపోయేవాడు పరమేస్వరుడా
నీతో కూడి గంగని మోయటమేమి
అయిననూ నోరు మెదపక తనలో సగభాగమయినావు

మట్టి ముద్దలో ప్రాణము పోసి ముచ్చట పడ్డావు
వివేచన మరచి ప్రాణము తీసాడు నీ దేవుడు
ఇలాటి దేవుడికన్నా నయం నీ దేవుడని
నా దేవికి చెప్పమ్మా గౌరమ్మా

పించ్చము తలలో ఉంచి మురళిని చేతిలో తిప్పుతూ
ఆడమందను వెంట తిప్పుకున్నాడు
సిగ్గు విడిచి చీరలెత్తుకెళ్ళిననూ
మోహించి పెళ్లి మండపము విడిచి వచ్చావు

వరములుగా వచ్చిన కన్యలను కాదనడేమి
ఏడుగురు సవతులనిచ్చిన వాడు కామాంధుడు కాదా
ఆ మొహనుడికన్నా నయం నీ మోహనుడని
నా దేవికి చెప్పమ్మా రాధమ్మా

అవసరానికి అప్పులు చేయుట తప్పదని
అది తప్పు కాదని అప్పు చేసి రుణపడ్డాడు
తీర్చుటకు ఏడు కొండలేక్కి గూడు కట్టుకున్నా
ఆయనవెంటే ఏడు అడుగులు నడిచావు దేవీ శ్రీదేవి

లోకం పోకడలు తెలిసిన దేవతలారా
తెలిసి వలచి సరిచేసుకుని కథలల్లినారు
మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా
నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *