నీ చూపులకి చిరునవ్వుల తాకిడి తెలుసుకాబోలు
ఆ జడి వానలో నేను తడిసిపోతున్నా
నీ పలుకులకి తేనెతుట్టె పల్లకి కాబోలు
ఆ తియ్యదనంలో నేను మైమరచిపోతున్నా
చిరునవ్వుల చూపులకి తేనె పలుకులు నాకోసం తోడవుతుంటే
నేనే పల్లవినై నీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండునా ?
నీ చరణాలను సేద తీరాలకు దరి చేర్చి
నేనే నావనై నీ చుక్కానిగా నిలిచిపోనా ఈ జన్మకు …