మండుతుంది లోన , బాగా మండుతోంది
కష్టంగా , చాల కష్టంగా గడుస్తున్నది
నిమిషం ఒక గంటలా ; గంట ఒక రోజులా
ఎంత వేచిన ఇంకా తెలవారదేమి ?
నిమిషం నిమిషం లెకేస్తున్నా
రెండు కళ్ళలో నీ రూపం నింపుకుని
రేయంత లేక్కేస్తున్నా
ఆరని నక్షత్రాలని దీనంగా చూస్తూ లేక్కేస్తున్నా!
నేను వస్తానని నువ్వు పెట్టిన ఒట్టు గుర్తు
గుర్తుకు వచ్చి నెత్తి మీద చేయఎసుకున్నా
ఆకాశం లోని మంచు కళ్ళలోకి జారినట్టున్నది
నీ ఉసుల్తో మళ్ళి వూపిరిలూదుతున్నావారా ?
నువ్వు పక్కన లేవని తెలిస్తే చాలు
తెలియని చలి గుర్తుకువస్తున్నది
రోమాలు నిక్కపోదుచుకుంతున్నవి … ఒళ్ళు జలదరిస్తున్నది
నీ రాక ఆలస్యమైతే నా గుండె చప్పుడు ఆగిపోతున్దేమోరా !
నీ చేతిలోకి నా చేయిని తీసుకుని
నీ సొట్ట బుగ్గలతో సిగ్గులొలికిస్తూ
నువ్వు చెప్పే తేనే కబుర్లకోసం
తెలవారేవరకు నేను వేచివుంటాను
రేపు మనది అని నాలో నమ్మకం నింపి
బ్రతుకు ఓంపులలో నీకు నేను తోడని చెప్పి
గుండెల నిండా ఆసలు నింపావు
ఒక్కొక్క ఆశ వెలిగించి నీకు హారతి కోసం వేచి వుంటాను
రేపు కాకపోతే మాపు అని … ఆ మరునాడు అని
నువ్వు వచ్చేవరకు వేచివుంటాను
రొజూ నక్షత్రాలు ఆరిపొయ్యేవరకు లేక్కిస్తాను
కలువలకి సూరీడు కావాలి … నాకు నువ్వు కావాలి