The Sky Down Lines

Personal Blog: Thoughts & Opinions on Travel and Poetry. Leisure for more Life.


నీ చుక్కానిగా నిలిచిపోనా ఈ జన్మకు ….

నీ చూపులకి చిరునవ్వుల తాకిడి తెలుసుకాబోలు

ఆ జడి వానలో నేను తడిసిపోతున్నా!!!

నీ పలుకులకి తేనెతుట్టె పల్లకి కాబోలు

ఆ తియ్యదనంలో నేను మైమరచిపోతున్నా!!!

చిరునవ్వుల చూపులకి తేనె పలుకులు నాకోసం తోడవుతుంటే

నేనే పల్లవినై నీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండునా ?

నీ చరణాలను సేద తీరాలకు దరి చేర్చి

నేనే నావనై నీ చుక్కానిగా నిలిచిపోనా


Home | Raja Sekhar Emmela | raja@emmela.com | Profession


Other Blogposts