The Sky Down Lines

Personal Blog: Thoughts & Opinions on Travel and Poetry. Leisure for more Life.


నా దేవికి ఒక్క మాటైననూ చెప్పరేమీ ??

రామా రామా నా రామా అన్నావు

అనగా అనగా నీతో కులికి తిరిగినాడు

తిరిగి తిరిగి నిన్ను అడవులకు తోలినాడు

తోలిననూ నోరు మెదపక పిదప ప్రాణమిచ్చినావు  


చాకలి వాకిలి బయట పలకడమేమి ?

లోకులు కాకులని తెలియని రాముడు రాజేలతల్లీ

ఇలాటి రాముడికన్నా నయం నీ రాముడని

నా దేవికి చెప్పమ్మా సీతమ్మా


జోలె సంచి పట్టి బూడిదిచ్చు వాని కథ ఏమి?

ముఖస్తుతికి పడిపోయేవాడు పరమేశ్వరుడా

నీతో కూడి గంగని మోయటమేమి

అయిననూ నోరు మెదపక తనలో సగభాగమైనావు


మట్టిముద్దలో ప్రాణము పోసి ముచ్చటపడ్డావు

వివేచన మరచి ప్రాణము తీశాడు నీ దేవుడు

ఈలాటి దేవుడికన్నా నయం నీ దేవుడని

నా దేవికి చెప్పమ్మా గౌరమ్మా


పింఛము తలలో వుంచి మురళిని చేతిలో త్రిప్పుతూ

ఆడమందను వెంట తిప్పుకున్నాడు

సిగ్గు విడిచి చీరలెత్తుకెళ్లిననూ

మోహించి పెళ్లి మండపము విడిచి వచ్చావు


వరములుగా వచ్చిన కన్యలను కాదనాడేమి

ఏడుగురు సవతులనిచ్చినవాడిని కామాంధుడు కాదా

ఆ మోహనుడికన్నా నయం నీ మోహనుడని

నా దేవికి చెప్పమ్మా రాధమ్మా


అవసరానికి  అప్పులు చేయుట తప్పదని

అది తప్పు కాదని అప్పు చేసి రుణపడ్డాడు

తీర్చుటకు ఏడు కొండలెక్కి గూడు కట్టుకున్నా…

ఆయనవెంటే ఏడు అడుగులు నడిచావు దేవి శ్రీదేవీ


లోకం పోకడలు తెలిసిన దేవతలారా

తెలిసి వలచి సరిచేసుకుని కథలల్లినారు

మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా నా దేవికి

ఒక్క మాటైననూ చెప్పరేమీ ??



Home | Raja Sekhar Emmela | raja@emmela.com | Profession


Other Blogposts